Drinking Water | రామాయంపేట రూరల్, మార్చి 31 : వేసవి కాలం ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. చాలా వరకు గ్రామాల్లో సరిపడే నీరు అందక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు కూడా సన్నటిదారలా రావడంతో గంటల తరబడి బిందెలు పట్టుకొని నల్లాల వద్దే ఉంటున్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని సరాఫరా చేసింది. ఒక వేళ ఈ సరఫరాలో ఏదైనా అంతరాయం కలిగితే గ్రామ పంచాయితీ బోర్ల ద్వారా గ్రామాల్లోని ట్యాంకు, బస్తీల్లోని మినీట్యాంకులకు నీటిని అందింది నీటిని సమస్య లేకుండా చేసింది. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చిన సన్నటి దారలాగా వచ్చి పట్టుమని పదిబిందెలు కూడా రాని దుస్థితి నెలకొందని గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో పంచాయితీ ఆధ్వర్యంలో ఉన్న బోర్ల నుండి అయినా నీటిని అందించాలని కోరితే అవి రిపేరులో ఉన్నాయని కొందరు, కాలిపోయాయని మరికొందరు చెప్తుండగా.. కనీసం ట్యాంకర్లను పెట్టడానికి కూడా పంచాయితీల్లో డబ్బులు లేవని కొందరు అధికారులు చెప్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధికారులను కూడా తాము తప్పు పట్టడం లేదని పాలకులు ఉంటే వారినే అడిగే వాళ్లమని మహిళలు అంటున్నారు.
ఉదయం పూట పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి వంట చేద్దామంటే నీరు రాక వంట చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి అప్పటి సమయానికి సర్దుకుపోవాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని.. ఆయన విలువ ఇప్పుడు తెలుస్తుందని కేసీఆర్ ఉంటే నీటి సమస్య పరిష్కార మార్గం తక్షణమే ఉండేదని నిర్బయంగా అంటున్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం