న్యూఢిల్లీ: దేశంలో అర్హత లేని ఫేక్ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించింది. ఆ యూనివర్సిటీల జాబితాను శనివారం తాజాగా విడుదల చేసింది. వీటిలో చదివే, చదవాలనుకొనే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే యూజీసీ దేశంలో కొనసాగుతున్న యూనివర్సిటీల అర్హతలపై సమీక్ష చేస్తుంది.
యూజీసీ చట్టం ప్రకారం అర్హత లేని యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు, పీజీలు చెల్లవు. తాజా జాబితా ప్రకారం ఏపీలోని గుంటూరులో ఉన్న క్రిస్ట్ న్యూ టెస్ట్‌మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలు నకిలీవి. రాష్ర్టాల వారీగా చూస్తే ఢిల్లీలో 12, యూపీలో 4, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో రెండు చొప్పు నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్టు తేలింది.