హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సాయుధ రైతాంగ పోరాట వీరుడు ఠానూనాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్ కోరారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి ఆవిష్కరించారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు చేయడంతో పాటు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని సెప్టెంబర్ 1లోగా అమలు చేయాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సీఎస్ సంజయ్ జాజు, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.