బెంగుళూరు : బెంగళూరు రెస్టారెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 15 నుంచి స్విగ్గీ, జొమాటో, ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి ఆన్లైన్ ఆర్డర్లను ఆపేస్తున్నట్టు బృహత్ బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్, ఇతర రెస్టారెంట్ గ్రూపులు ప్రకటించాయి.
ఫుడ్ డెలివరీ యాప్‌లు సాధారణ కమీషన్‌తో పాటు పేమెంట్ గేట్ వే ఫీజులు, ప్రచార చార్జీలు ప్రకటనల ఖర్చులు, డిస్కౌంట్లు, లాయల్టీ ప్రోగ్రామ్ పేరుతో విధించే కోతలతో రెస్టారెంట్ల ఓనర్లు సతమతం అవుతున్నారని బీబీహెచ్ఏ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. తమ అనుమతి లేకుండానే విధిస్తున్న అదనపు చార్జీలపై వివరణ ఇవ్వాలని కోరారు.