న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: వైద్యులు, నర్సులు అందుబాటులో లేకపోవడంతో ఓ స్వీపర్ డాక్టర్ అవతారమెత్తింది. పురిటి నొప్పులతో బాధపడుతూ దవాఖానకు వచ్చిన ఓ గర్భిణికి ప్రసవం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలోనే శిశువు కడుపులో అడ్డం తిరిగింది.
విషయం తెలుసుకున్న వైద్యులు దవాఖానకు చేరుకొని ప్రసవం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే శిశువు మృతి చెందింది. ఛత్తీస్గఢ్లో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుర్గుజా జిల్లాలోని లఖన్పుర్ గ్రామంలోని కున్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.