Thieves | నిజాంపేట, మే 31 : నిజాంపేట మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కల్వకుంటలోని పెద్దమ్మ, గంగమ్మ తల్లి ఆలయాలలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు.
అర్థరాత్రి ఆలయంలోకి చొరబడ్డ దొంగలు ఆలయ తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టి 4 తులాల వెండి ఆభరణాలు, హుండీలోని కొంత నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఎస్సైలు రాజేశ్, సృజన శనివారం దొంగతనం జరిగిన ఆలయాల వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత