Fertilizers | పాపన్నపేట, జూలై 13 : రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆయన ఆదివారం మండల పరిధిలోని పొడిచానుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం లక్ష్మీ నగర్‌లోని ఫర్టిలైజర్ షాప్‌ను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా మొత్తంలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. లక్ష్మీనగర్ ఫర్టిలైజర్ షాప్‌లో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాలు ఈ పాస్ యంత్రంలో నమోదు వివరాలను ఆయన పరిశీలించారు.
ప్రస్తుతం యూరియా, కాంప్లెక్స్ ఎరువులతోపాటు పొటాష్ అందుబాటులో ఉన్నాయని, యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ తెలిపారు. పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల ఎరువుల విక్రయ కేంద్రాలకు మ్యాపింగ్ చేయాలని, వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. ఎరువుల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రతి రోజు సమయపాలన పాటించి, వచ్చిన ఎరువులను క్రమ పద్ధతిలో రైతులకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం