వెల్దండ జులై 13 : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోనిపల్లి గ్రామంలో ఆదివారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యా యి. మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపిటిసి హరి కిషన్ నాయక్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి సీసీ రోడ్డు పనులను ప్రారంభిం చారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ..కోట్ర గేటు నుండి తిమ్మినోనిపల్లి గ్రామానికి బీటీ రోడ్డును ఎమ్మెల్యే కసిరెడ్డి మంజూరు చేశారన్నారు.
గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ రాజేష్ రెడ్డి, నాయ కులు రమాకాంత్ రెడ్డి శోభన్, రవి గౌడ్, నరసిం హ, మాధవ రెడ్డి,యాదవ రెడ్డి, రాములు, శ్రీశైలం, సత్తయ్య, శేఖర్ గౌడ్, శ్రీను, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.