Protest : తమిళనాడు (Tamil Nadu) కస్టోడియల్ డెత్ (Custodial death) ను ఖండిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. విజయ్ సమక్షంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ కస్టడీ (Police custody) లో మరణించిన అజిత్ కుమార్ (Ajith Kumar) కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అజిత్ కుమార్ తమిళనాడు రాష్ట్రం శివగంగయ్ జిల్లాలోని మాదపురం ఆలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఓ మహిళ అతడు తన నగలు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అజిత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో సీఎం స్టాలిన్ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు శనివారం ఈ కేసును టేకప్ చేశారు. ఇదిలావుంటే లాకప్ డెత్‌కు బాధ్యులైన ఐదుగురు పోలీసులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులు డీఎస్పీని సస్పెండ్ చేశారు.
అజిత్‌కుమార్‌ను పోలీసులు అనధికారికంగా కస్టడీలోకి తీసుకుని చిత్రవధ చేసి చంపినట్లు సెషన్స్ జడ్జి తన నివేదికలో నిర్ధారించారు. దాంతో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్.. ఆగస్టు 20 లోగా తుది నివేదికను అందజేయాలని సీబీఐని ఆదేశించింది. కాగా నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి.
కాగా విజయ్ పొలిటికల్ మైలేజీ కోసం ఇంత పెద్ద ఎత్తున నిరసనకు పథక రచన చేశాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ బల ప్రదర్శన చేశాడని అంటున్నారు.
#WATCH | Chennai, Tamil Nadu: TVK cadre stage protest in the presence of party chief and actor Vijay, demanding justice for the custodial death victim Ajith Kumar.
(Source: TVK) https://t.co/f1gyLPLHxs pic.twitter.com/DZgvPHZumW
— ANI (@ANI) July 13, 2025