Online Shopping Fraud Case | ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ ఆన్లైన్ షాపింగ్‌లో మోసపోయింది. ‘ట్రఫుల్ ఇండియా’ అనే ఆన్లైన్ క్లాతింగ్ వెబ్సైట్ ద్వారా కొన్ని దుస్తులను ఆర్డర్ చేసింది ఈ అమ్మడు. వీటికి ముందుగానే డబ్బులు చెల్లించింది. అయితే ఆర్డర్ పెట్టి నెల రోజులు గడుస్తున్నా ఇంకా డెలివరీ అవ్వకపోవడంతో పాటు రీఫండ్ కూడా రాకపోవడం పట్ల అనసూయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇది దోపిడీతో సమానం అని పేర్కొన్న అనసూయ.. ఇలాంటి ఆన్లైన్ సంస్థలను నమ్మవద్దని, వస్తువులను కొనుగోలు చేయవద్దని ప్రజలను హెచ్చరించింది. తనలా ఎవరూ మోసపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని పంచుకున్నట్లు ఆమె తెలిపారు.