మాగనూరు : మాగనూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగిస్తు పట్టుబడి మాయమైన హిటాచి( Hitachi ) ఘటన కలకలం రేపుతుంది. అమ్మపల్లి సమీపంలో గత బుధవారం 10 ఇసుక డంపులు, ఒక ట్రాక్టర్, ఒక హిటాచిని జిల్లా మైనింగ్ ఆర్. ఐ ప్రతాప్ రెడ్డి గుర్తించి సీజ్ చేసి, ట్రాక్టర్లు మాత్రమే పోలీస్ స్టేషన్లో అప్పగించారు. హిటాచి పెద్ద వాహనం కావడంతో వాగు సమీప దూరంలోనే వదిలేసి వచ్చారు.
హిటాచిని సీజ్ చేసిన గంట వ్యవధిలోని ఆ వాహనం అక్కడి నుంచి మాయం అయ్యింది. అదే రోజు రాత్రి ఇసుక రీచ్ ల వెంబడి ఎస్ఆర్ఏలను, జీపీవోలను బందోబస్తు ఏర్పాటు చేసినా గాని హిటాచి మాయం కావడంతో రెవెన్యూ సిబ్బందిలో వణుకు మొదలైంది. దీంతో విషయం తెలుసుకున్న తాసిల్దార్ సురేష్ హిటాచి ఓనర్ పై మాగనూరు ఎస్సై అశోక్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.