IND vs ENG : బిగ్ మ్యాచ్‌లోనైనా ఆడతాడనుకుంటే ఓపెనర్ అభిషేక్ శర్మ 9 పరుగులకే ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్లకు వికెట్ ఇచ్చేస్తున్న అతడిని విల్ జాక్స్(1-19) బోల్తా కొట్టించాడు. బౌండరీ సాధించిన అభిషేక్.. టైమింగ్ కుదరకమిడాఫ్లో ఫిల్ సాల్ట్ చేతికి చిక్కాడు. తొలి ఓవర్లోనే 4, 6తో తన తడాఖా చూపించిన సంజూ శాంసన్(41 నాటౌట్) బౌండరీలతో అలరిస్తున్నాడు. ఓవర్టన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(16 నాటౌట్) వరుసగా రెండు ఫోర్లతో స్కోర్ 50 దాటింది. పవర్ ప్లేలో
ఈడెన్ గార్డెన్స్‌లో అజేయ అర్ధ శతకంతో భారత్‌ను గెలిపించిన సంజూ శాంసన్ సెమీస్‌లోనూ దంచేస్తున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ() ఔటైనా.. తానేమీ తొందరపడకుండా స్కోర్ బోర్డును ఉరికిస్తున్నాడు. 15 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ క్యాచ వదిలేయండంతో బతికిపోయిన ఈ చిచ్చరపిడుగు.. ఆర్చర్ ఓవర్లో 4 , 6, 4తో 14 రన్స్ పిండుకున్నాడు.
India fly to 67-1 in the powerplay 📈
Ball-by-ball updates: https://t.co/ocWPoSgbyB pic.twitter.com/E7e1Gd4XQd
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2026
ఆపై జాక్స్‌ను ఉతికేస్తూ ఇషాన్ కిషన్(16 నాటౌట్).. సంజూ చెరొక ఫోర్ కొట్టారు. ఆపై.. ఓవర్టన్కు దడ పుట్టిస్తూ వరుసగా రెండు ఫోర్లో స్కోర్ 50 దాటించాడు ఇషాన్. పవర్ ప్లే చివరి ఓవర్లో సామ్ కరన్‌ను బాదేస్తూ.. తొలి రెండు బంతుల్ని సంజూ బౌండరీకి తరలించాడు. దాంతో.. 6 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.