జడ్చర్ల వైద్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
జడ్చర్లలోని ప్రభుత్వ దవాఖాన వైద్యులపై జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
- మార్చురీ నిర్వహణ బాధ్యత వైద్యులది కాదు
- మార్చురీల్లో వసతులకు సంస్కరణలు తేవాలి
- తెలంగాణ వైద్యుల సంఘం
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): జడ్చర్లలోని ప్రభుత్వ దవాఖాన వైద్యులపై జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. దవాఖాన మార్చురీని 24 గంటలపాటు నిర్వహించడం వైద్యుల బాధ్యత కాదని పేర్కొన్నది. వైద్యుల బాధ్యత సమయానికి పోస్టుమార్టం నిర్వహించడం మాత్రమేనని, మార్చురీ నిర్వహణ, భద్రత, పర్యవేక్షణ బాధ్యతలు మార్చురీ సూపర్వైజర్లు, సంబంధిత సహాయక సిబ్బందివేనని అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రౌఫ్ తెలిపారు. పాత దవాఖాన భవనంలో మార్చురీ ఉన్నదని, అది శిథిలావస్థకు చేరిందని, అందువల్ల జంతువులు, కుకలు, ఎలుకలు ప్రవేశించే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. వైద్యులు ప్రధానంగా రోగుల చికిత్స, వైద్య సేవలపైనే దృష్టి సారిస్తారని, ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నదని పేర్కొంటూ చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చురీ మౌలిక వసతుల బలోపేతానికి సంసరణలు తేవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

