Sports Training Camps | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 28 : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశానుసారం మెదక్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 గ్రామీణ ప్రాంతాల్లో 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడా యువజన క్రీడాల అధికారి దామోదర్‌రెడ్డి తెలిపారు. మే 1వ తేదీనుంచి జూన్ 6వ తేది వరకు కొనసాగించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
శిక్షణ నిమిత్తం సీనియర్ వ్యాయమ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అనుభవజ్ఞులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. శిక్షకుడికి రూ.5 వేల పారితోషికంతోపాటు క్రీడా సామాగ్రి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ శిబిరాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు.
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించే ప్రాంతాలివే..
1. జడ్పీహెచ్ఎస్ ప్రగతి ధర్మారం, రామాయంపేట మండలం
2. మోడల్ స్కూల్, చేగుంట
3. తెలంగాణ క్రీడా ప్రాంగణం, మనోహరబాద్
4. జడ్పీహెచ్ఎస్ ముస్లాపూర్, అల్లాదుర్గం మండలం
5. జడ్పీహెచ్ఎస్ మడూర్, చిన్న శంకరంపేట
6. జడ్పీహెచ్ఎస్, మసాయిపేట
7. జడ్పీహెచ్ఎస్ బుజ్రంపేట్, కౌడిపల్లి
8. జడ్పీహెచ్ఎస్ ఘనపూర్, తూఫ్రాన్ మండలం
9. జడ్పీహెచ్ఎస్ గోమారం, శివ్వంపేట మండలం
10. జడ్పీహెచ్ఎస్ కూచన్‌పల్లి, హావేళి ఘనపూర్ మండలం
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్