Gajwel | జగదేవపూర్ మార్చి26 : 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గజ్వేల్ అభివృద్ది శూన్యం అని కొండపోచమ్మ దేవాలయ కమిటీ మాజీ డైరెక్టర్ మండల బీఆర్ఎస్ నాయకుడు కనకయ్య విమర్శించారు. ఇవాళ ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో గజ్వేల్‌ను రూ.10 వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ది చేశారన్నారు. ఎక్కడో ఓదగ్గర ఏమైనా ఒకటి రెండు పనులు మిగిలి ఉంటే అవి కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.
గజ్వేల్ అభివృద్దికి ఒక్క పైసా కూడా తీసుకరాని కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌ను వమిర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఆరుగ్యారంటీలు అమలు చేస్తమని 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పథకాలు అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. రైతు భరోసా ద్వారా రూ.15 వేలు ఇస్తమని చెప్పి ఉన్న రైతుబంధును ఎగరగొట్టిన రాబంధు ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు.
కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీరందించేందుకు అవకాశం ఉన్నా పరిపాలన చాతగాక సాగు నీరియ్యకపోవడంతో రైతులు తామంతట తామే ఎండుతున్న పంటలకు నిప్పు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో ఉద్యోగాలు అని ఆశ చూపి ఒకటో తారీఖునే జీతాలు అని నమ్మించి ఎక్కడికక్కడ ఉద్యోగులను కాంట్రాక్టు కార్మికులను వంజన చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారన్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి