భద్రాచలం, మార్చి 26 : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. భద్రాచలం పట్టణం శాంతినగర్ కాలనీకి చెందిన తొండవరపు అర్జున్ 17 జూన్, 2022న ప్రమాదవశాత్తు మరణించాడు. పార్టీ సభ్యత్వం ఉండడంతో బీమా కింద మంజూరైన రూ.2 లక్షలను రాంప్రసాద్ బాధిత కుటుంబానికి బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఆకోజు సునీల్‌కుమార్, మండల నాయకుడు రామకృష్ణ, బీసీ సెల్ గౌరవ అధ్యక్షుడు గోసుల వెంకట శ్రీనివాస్, రేగుల నరసింహారావు పాల్గొన్నారు.