Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
Road Accident | సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident | బేగంపేట్, మార్చి 26 : సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు స్పాట్లోనే ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.
మహంకాళి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బన్సీలాల్ పేటకు చెందిన బన్సీలాల్ పేట్ ప్రాంతానికి చెందిన ప్రణయ్(18) హర్షిత్ (21) జీహెచ్ఎంసీ వేస్ట్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి స్పోర్ట్స్ బైక్‌పై ఉదయం 5 గంటల ప్రాంతంలో మహంకాళి పీఎస్ పరిధిలోని ఎస్డీ రోడ్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్ చౌరస్తా వద్ద అతివేగంగా స్విఫ్ట్ డిజైర్ కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో సీసీ నగర్‌కు చెందిన ప్రణయ్ స్పాట్లోనే చనిపోగా, హర్షిత్‌ను గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపో పోయినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

