తిరుమల : రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, నున్న సరోజినిదేవి దంపతులు తిరుమల( Tirumala) శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు బుధవారం రూ.1,01,11,111 విరాళంగా ( Donations ) అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ( BR Naidu) , అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్, అదనపు ఈవో అభినందించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు ( Compartments) నిండిపోయాయి. ఎంబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్లుకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD ) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 64,252 మంది భక్తులు దర్శించుకోగా 25,943 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.68 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.