Cage wheel tractors | రాయపోల్, జులై 26 : కొత్తగా వేసిన బీటీ రోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఎస్ఐ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. బీటీ రోడ్డుపై కేజ్వీల్స్ తో ట్రాక్టర్ నడపవద్దని సూచించారు.
రోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్ను నడపరాదని.. ఒకవేళ రోడ్డు మీదకు ట్రాక్టర్ను తీసుకు వస్తె చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. బీటీ రోడ్లపై ట్రాక్టర్ కేజ్వీల్స్ తో నడిపితే రోడ్డు పగుళ్లుపోతుందని. అందరికీ, ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే రోడ్డును పాడు చేసుకోవద్దన్నారు. ట్రాక్టర్ కేజ్వీల్స్ ను నడిపించవద్ధని ఈ విషయంలో రైతులు ట్రాక్టర్ యజమానులు పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ పనులు ఉంటే కేజ్వీల్స్ను ట్రాక్టర్ఫై తీసుకుపోయి అక్కడనే ఫిట్టింగ్ చేసుకుని వ్యవసాయ పనులు చేసుకోవాలని కోరారు. ట్రాక్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా రోడ్లపై కేజ్వీల్స్ను నడిపిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన