Rayapole Mandal | రాయపోల్, జనవరి 20 : పేద కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, ఉప సర్పంచ్ బంధరం సంతోష్‌లు అన్నారు. మంగళవారం మంతూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన తోడేంగల కిషన్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన కిషన్ మృతి చేయడం బాధాకరమని, ఆయన కుటుంబానికి రైతూ బీమా పథకం ద్వారా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. గ్రామంలో ఎవరికి ఆపద, సంపద ఉన్న అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అటు ప్రజల సంక్షేమం.. ఇటు గ్రామ అభివృద్ధికి కంకణ బద్దులుగా ఉండి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి మండలంలోని గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జీడిపల్లి బాగిరెడ్డి, వార్డు సభ్యులు నర్సింలు. షాదుల్, దయ్యలా మహిపాల్, పడిగే కుమారు, దండు శ్రీను, పడిగే మల్లేశం, పడిగే కృష్ణ, వరద సంతోష్, దండు స్వామి పోచయ్య, ఖలీల్, కిష్ట రెడ్డి, దండు నర్సయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Salaar 2 | ప్రభాస్ సలార్ 2 టీజర్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ తేదీనో తెలుసా..?
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్