Vote | రాయపోల్, జనవరి 25 : 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఆదివారం టూ కే రన్తోపాటు ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ గ్రామం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు టూ కే రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాయపోల్ తహసిల్దార్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, గ్రామ యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
T20 World Cup | పాకిస్తాన్కు ఐసీసీ వార్నింగ్.. తోక ముడిచిన పాక్.. టీ20 జట్టు ప్రకటన
Narsapur | చిత్తారమ్మ దేవి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దుండగులు