T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్‌కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో తోక ముడిచిన పాక్.. టీ20 జట్టును ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి ఇండియాలో మ్యాచులు ఆడబోమని బంగ్లాదేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ.. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది.
అయితే, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తమ జట్టు టోర్నీలో ఆడటంపై కూడా ఆలోచిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వి చెప్పాడు. ప్రభుత్వం చెబితే తాము టోర్నీలో పాల్గొనబోమని ప్రకటించాడు. దీనిపై స్పందించిన ఐసీసీ పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. టోర్నీ నుంచి వైదొలిగితే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ద్వైపాక్షిక సిరీస్‌ల రద్దు చేస్తామని, ఆసియా కప్ నుంచి తొలగిస్తామని, పాక్ ఆటగాళ్లు ఇతర లీగ్‌ల్లో పాల్గొనకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం కలుగుతుంది.
అందుకే వెంటనే భయపడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వెంటనే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే క్రికెట్ జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా ఈ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇతర సభ్యుల వివరాలు.. బాబర్ ఆజం, మహ్మద్ సల్మాన్ మిర్జా, షాహిన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఫహీం అష్రఫ్, ఫఖర్ జమాన్, ఫర్హాన్, ఖవాజా మహ్మద్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీం షా, షాదాబ్ ఖాన్, సయం ఆయుబ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తారిక్.