నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గల శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయ ప్రాంగణంలో గల హుండీని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి డబ్బులను అపహరించారు. వివరాల్లోకి వెళితే.. బ్రాహ్మణపల్లి గ్రామంలోని చిత్తారమ్మా దేవి ఆలయ ప్రాంగణంలో ఆలయనిర్వాకులు హుండీని ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు వారికి తోచినంత నగదును హుండీలో వేయడం జరుగుతోంది.
ఇదే అదునుగా చూసిన కొందరు దుండగులు శనివారం రాత్రి హుండీని ధ్వంసం చేసి డబ్బును అపహరించారు. గతంలో కూడా చాలాసార్లు హుండీ తాళం పగలగొట్టి అందులోని నగదును దొంగలించారని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా పవిత్రమైన అమ్మవారి హుండీని దుండగుల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.