urea Distribution | రాయపోల్, ఆగస్టు 25 : యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలోకి లారీ లోడ్ యూరియా రావడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోలీస్ పహారాలో ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున క్యూలైన్ ద్వారా నిల్చున్న రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియాను అందించారు.
నేడు ఉదయం నుంచి షాపు వద్ద యూరియా కోసం వేచి ఉన్న ఫలితం లేకుండా పోయిందని గ్రామా రైతులు ఆవేదన చెందారు. తక్కువ యూరియా రావడంతో ఎక్కువ మంది రైతులు రాగా.. 400 యూరియా బస్తాలను వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో రైతులకు అందజేశారు. రైతులందరికీ యూరియాను సరఫరా చేస్తామని మండలంలోని చాలా గ్రామాల రైతులకు యూరియాను అందించామని.. యూరియా దొరకక రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మళ్లీ యూరియా వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం వద్ద యూరియా వస్తుందని.. ఆశతో రైతులు ఉదయం నుంచి పట్టా పాస్ బుక్కులు పట్టుకుని గంటల తరబడి పడిగాపులు కాసిన వ్యవసాయ అధికారులు మాత్రం సమయానికి రాకపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురై చెత్త కింద పడుకున్నారు. సమయానికి వ్యవసాయ అధికారులు రాకుండా ఉండకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతువేదిక కార్యాలయాన్ని ముట్టడించారు. అయినా యూరియా రావడంలేదని తెలవడంతో రైతులు చేసేదేమీ లేక అక్కడినుంచి వెనుతిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోయారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు