Gurukul Students | చేర్యాల, మే 18 : గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్ధులతోపాటు గతంలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.మన్విచంద్ తెలిపారు.
చేర్యాలలో కొనసాగుతున్న జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.మన్విచంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల విద్యాలయాల సంస్ధ కార్యదర్శి వర్షిణి ఉత్తర్వుల మేరకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్ధులు శిక్షణకు అర్హులన్నారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులతోపాటు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నియమ నిబంధనల ప్రకారం శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని తెలిపారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన, డిగ్రీ ఫైనలియర్ చదువున్న విద్యార్థులతోపాటు, చదువు మధ్యలో మానేసిన వారికి శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పొందాలనుకునే విద్యార్థులు చేర్యాల గురుకులంలో ఈ నెల 19వ తేదీలోపు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్