Wind Storms | వర్గల్, ఆగస్టు 23 : రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. కాగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు విజృంభిస్తున్నాయి. సిద్ధిపేట జిల్లాలోని వర్గల్ మండలంలో మంగళవారం, బుధవారం వీచిన బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
తీవ్రమైన ఈదురుగాలుల ధాటికి రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లు విరిగి పడుతున్నాయి. ఈదురుగాలులతో సింగాయి పల్లి వద్ద ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడింది. ఈ నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణించే వాళ్లు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు.
కాగా బుధవారం హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కేంది. ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు