Road Repair | మునిపల్లి, ఆగస్టు 12 : మంత్రివర్యా.. ఈ రోడ్లకు మరమ్మతులు చేపియండి సార్.. మునిపల్లి మండలంలోని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషమే. గట్లనే ప్రమాదకరమైన కంకోల్ -తాటిపల్లి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలకు మరమ్మత్తులు కూడా చేయించండి సార్ అంటూ మునిపల్లి మండల వాసులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిహను వేడుకుంటున్నారు. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఏడాది పూర్తికాకముందే పూర్తిగా ఈ రోడ్డు ధ్వంసమైందని మండల వాసులు సంబంధిత కాంట్రాక్టర్ పై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇష్టానుసారంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టారని.. నాణ్యత లేకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నట్లు మండల వాసులు కాంట్రాక్టర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదకరంగా మారిన గుంతలు పూడ్చే వారే కరువయ్యారా అంటూ మండల వాసులు సంబంధిత అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కంకోల్- తాటిపల్లి ప్రధాన రోడ్డుపై ఏర్పడ్డ ప్రమాదకరమైన గుంతలను తక్షణమే పూడ్చివేసి బాగు చేసేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు, ప్రయాణికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Dharmasthala: ధర్మస్థలిలో మృతదేహాల వెలికితీత.. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు
RS Praveen Kumar | కోడి గుడ్ల కుంభకోణం రూ. 600 కోట్లు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Gunfire | చందానగర్‌లో దొంగల బీభత్సం.. ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు
.