Transformer | రాయపోల్, జూన్ 14 : విద్యుత్ అధికారుల ఇష్టారాజ్యం ఫలితంగా మండల కేంద్రమైన రాయపోల్ డబుల్ బెడ్ రూమ్ వెళ్లే మార్గంలో ట్రాన్స్ఫార్మర్ బిగించి సంవత్సరం గడుస్తున్నా.. ఇంతవరకు దానికి కనెక్షన్ ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. లో వోల్టేజ్ ఉండటంతో అదనంగా ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికీ దానిని గద్దెపై ఉంచి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతులు చేయడం లేదు. దీంతో ట్రాన్స్ఫార్మర్ పిచ్చి మొక్కలతో కనిపించకుండా పోయింది.
లో లోవోల్టేజితో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తే ఎంతోమంది విద్యుత్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. రోడ్డు పక్కనే అలంకారప్రాయంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ అటువైపు నిత్యం వెళుతున్న విద్యుత్ శాఖ అధికారులు చూడకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెప్పుకున్నా ప్రయోజనం లేదని.. డబ్బులు ఇచ్చిన వారికే విద్యుత్ శాఖ అధికారులు పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు.
గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో..
రాయపోల్ మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. విద్యుత్ అధికారులు ప్రతినెల కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నప్పటికీ వినియోగదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోవడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ వృథాగా ఉంచడం పట్ల పలువురు విద్యుత్ శాఖ పనితీరుపై అసంతృప్తిలో ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ పిల్లర్ గద్దెపై ఉంచి నెలలు గడుస్తున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో చుట్టు పిచ్చి మొక్కలతో ఉంది.
విద్యుత్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వృధాగా ఉన్న కొత్త ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై మండల విద్యుత్ శాఖ శ్రీనివాసరావును వివరణ కోరగా.. తమ దృష్టికి రాలేదని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు