Weather Report | రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని.. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగితాల్య, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.
గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్ల రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. కుమ్రంభీం జిల్లాలో వానలు దంచికొట్టాయి. అత్యధికంగా దహెగాంలో 6.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.