గరిడేపల్లి, జూన్ 24 : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పిస్తుందని గరిడేపల్లి మండల తాసీల్దార్ బండ కవిత తెలిపారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారై ఉండి కుటుంబాన్ని పోషిస్తున్న వారు ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ, అనారోగ్య రీత్యా గానీ, ఏ కారణం చేతనైనా మరణిస్తే రూ.20 వేలు సాయం అందించబడుతుందని ఆమె తెలిపారు. బీపీఎల్ కార్డుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో రెండు సంవత్సరాల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల ప్రాసెస్సింగ్ వేగవంతం చేయాలని ఇబ్బందిని ఆమె ఆదేశించారు.