Rajya Sabha Elections: 11 సీట్లకు రాజ్యసభ ఓటింగ్.. ఏకగ్రీవంగా 26 మంది అభ్యర్థుల గెలుపు
Rajya Sabha Elections: 11 సీట్ల కోసం రాజ్యసభకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఏకగ్రీవంగా 26 మంది అభ్యర్థుల గెలుపు ఖారారైంది. బీహార్ నుంచి సీఎం నితీశ్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీలో ఉన్నారు.
న్యూఢిల్లీ: ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్ల కోసం ఇవాళ ఎన్నికలు(Rajya Sabha elections) జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనున్నది. అయితే 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటికే 26 అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే కొత్త సభ్యుల కోసం కేవలం 11 సీట్లకు మాత్రమే ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. బీహార్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది. బీహార్లో అయిదుగురు, ఒడిశాలో నలుగురు, హర్యానాలో రెండు సీట్ల కోసం ఎన్నిక జరుగుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో ఏడుగురు బీజేపీ, అయిదుగురు కాంగ్రెస్, టీఎంసీ నలుగురు, డీఎంకే నుంచి ముగ్గురు ఉన్నారు. శివసే, ఆర్పీఐ, ఎన్సీ, ఎన్సీపీ ఎస్పీ, అన్నాడీఎంకే, యూపీపీఎల్ పార్టీల నుంచి ఒక్కొక్కరు నెగ్గారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖుల్లో శరద్ పవార్, అభిషేక్ సింఘ్వీ, తిరుచ్చి శివ, వినోద్ తవడే ఉన్నారు. అయితే బీహార్ నుంచి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కూడా రాజ్యసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. తమిళనాడు నుంచి ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుచ్చి శివ, తందిదురై ఆ జాబితాలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

