Hyderabad | హైదరాబాద్లోని గండిపేటలో విషాదం నెలకొంది. మూసీ నదిలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు.
ఆదివారం సాయంత్రం ముగ్గురు యువకులు చేపల వేటకు వచ్చిన ముగ్గురు యువకులు మూసీ నదిలో గల్లంతయ్యారు. సోమవారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు, రెస్క్యూటీమ్ చేపట్టిన గాలింపు చర్యల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ వారు నీటిలో మునిగి గల్లంతైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతులను ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన కార్తీక్ (25), గోవర్దన్ (23), వెంకటేశ్ (25)గా గుర్తించారు. హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్కు చెందిన వారిగా నిర్ధారించారు. సోమవారం ఉదయం మృతదేహాలను బయటకు తీసిన అనంతరం.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.