కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ(ACB) అధికారుల సోదాలు చేపట్టారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని అన్ని శాఖలపై ఏసీబీ డీఎస్పీకి అందిన పలు ఫిర్యాదులపై సోమవారం సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
కాగా, గత కొంత కాలంగా మున్సిపల్ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ శాఖలపై ఏసీబీ దృష్టి సారించింది.