mla kotha prabhakar reddy | తొగుట, అక్టోబరు 15: కేసీఆర్ హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు నిర్మించి, ప్రధాన కాలువలు నిర్మించి కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగిందని, కాంగ్రెస్ పాలనలో కనీసం ఉప కాలువల నిర్మాణం లేకపోగా కాలువలలో పూడిక కూడా తీయడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.
తొగుట వ్యవసాయ మార్కెట్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై చిత్తశుద్ధి లేదని.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నలు మద్దతు ధర లేక దళారుల పాలవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంబించడం లేదన్నారు.
రేపటిలోగా మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా సన్నధాన్యంకు ఇంత వరకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులను డోకా చేయడమే అవుతుందన్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురిసాయని వర్షాకాలం పంటల దిగుబడి పెరుగుతుందని, యాసంగి సాగు పెరుగుతుందని రైతులకు విత్తనాలతో పాటు యూరియా ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పంట సాగు పెరిగినప్పుడు ధాన్యం కొనుగోళ్ల సమయంలో ముందస్తు చర్యలు తీసుకోకపోతే రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు..
రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకొని గోడౌన్ సదుపాయం, రవాణా గురించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సహాయం చేసే విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు. తెలంగాణ రాక ముందు కరువు మండలాల లీస్టులో తొగుట, రాయపోల్, దౌల్తాబాద్ మండలాలు ఉండేవని.. కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మించి గోదావరి జలాలు పారించిన తర్వాత కరువు మాయమైందన్నారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించుకున్నా
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించుకున్నా ఉప కాలువలు లేకపోవడంతో తొగుట మండలంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సాగునీరు ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి కాలువల నిర్మాణం కోసం అసెంబ్లీ లో నీలదీసినా, ప్రభుత్వంకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇంచార్జి మంత్రులు ఇప్పటికైనా స్పంధించి ఉప కాలువలు పూర్తి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్, మార్కెట్ కార్యదర్శి స్వామి, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లు కె హరికృష్ణారెడ్డి, కుర్మ యాదగిరి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, ఐకేపీ ఏపీఎం బాబురావు, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, సిరినేని గోవర్ధన్ రెడ్డి, వెల్బుల స్వామి, బక్క కనకయ్య, సుతారి రమేష్, కంది రాంరెడ్డి, బోదనం కనకయ్య, శ్రీశైలం, నర్సెట్టి మల్లేశం, మధుసుదన్ రెడ్డి, రాజిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మాదాసు ఆరుణ్ కుమార్, గొడుగు ఐలయ్య, నరెందర్ గౌడ్, బాలరాజు, తగరం ఆశోక్, అంజయ్య, మంగ యాదగిరి, మహేష్, శ్రీనివాస్ గౌడ్, బండారు స్వామిగౌడ్, రమేష్ గౌడ్, సంతోష్, జహంగీర్, రాంబాబుతో పాటు ఐకేపీ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.
సిరిసిల్లా రాజేశం కుటుంబానికి అండగా ఉంటాం
ఆకాల మరణం పొందిన మండలంలోని వెంకట్రావుపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సిరిసిల్లా రాజేశం కుటుంబానికి అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. వెంకట్రావుపేటలో ఆయన కుటుంబీకులను ఎమ్మెల్యే పరామర్శించి ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాజేశం లేని లోటు తీరనిదని, వారికి బాసటగా నిలుస్తామన్నారు.
Mla Kotha Prabhakar Reddy1
Kumuram Bheem | కుమ్రం భీం Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ
పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : పెందోర్ దాదిరావు
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య