నార్నూర్, అక్టోబర్ 15 : కుమ్రం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కోలామ గ్రామంలో కుమ్రం భీం 85వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. కుమ్రం భీం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండాను ఎగిరేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ హక్కుల కోసం నైజాం సర్కారుతో పోరాడి వీరుడైన కుమ్రం భీంను నేటితరం ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో రాణించాలన్నారు. నేటితరం యువత ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలన్నారు. ఉన్నత చదువులతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంబ్లే భగవాన్, పెందోర్ మధు, కుమ్రం శంకర్, గ్రామ పెద్దలు ఉన్నారు.