అమరావతి : ఏపీలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగుడు దారుణంగా హత్య ( Murder) చేశాడు. గుంటూరు జిల్లా తెనాలి ( Tenali ) చెంచుపేటలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం నడిచి వెళ్తున్న అమర్తులూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన బుజ్జిపై స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చిన దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలతో కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా జరిపారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హత్య ఎందుకు జరిగిందో దుండగుడు పట్టుబడితే గాని చెప్పలేమని పోలీసులు తెలిపారు. దుండగుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని వెల్లడించారు.