Sanitation | రాయపోల్, జూలై 19 : గ్రామాల్లో పారిశుధ్యం కోసం అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చిత్త శుద్ధితో కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అన్నారు. శనివారం రాయపోల్ మండలంలోని అనాజిపూర్ గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను, పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దేవకీదేవి మాట్లాడుతూ.. నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, ప్రధాన రహదారి వెంట ఉన్న మురుగు కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వణ పరిశీలించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రాయపోల్‌లో వైన్స్ షాప్, హోటల్స్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ తొలగించాలని ఒకవేళ షాప్ వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తే జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎల్లప్పుడు అందుబాటు ఉండాలని. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. అనంతరం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులకు టెలి కాన్ఫరెన్స్ తీసుకున్నారు.
పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, ఎంపీఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు పూర్ణచందర్ శివకుమార్ లు పాల్గొన్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత