సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న జోన్ల సంఖ్యను పెరిగిన పరిధికి పెంచారు. దీనికి అనుగుణంగానే 12 జోన్లకు విస్తరించిన ఉన్నతాధికారులకు దానికి అనుగుణంగానే అధికారుల సర్దుబాటు చేస్తున్నారు. 11 జిల్లాల్లోని 104 మండలాల పరిధిలోని 1355 గ్రామాలకు విస్తరించి హెచ్ఎండీఏ ఉంది. అవుటర్ రింగు రోడ్డు నుంచి ట్రిపులార్ వరకు ఉన్న ప్రాంతాల్లో కలిపి కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చిన జిల్లాల నుంచి క్రమంగా దరఖాస్తులు వస్తున్నాయి.
నిర్మాణ అనుమతుల కోసం ఎదురతున్న ఇబ్బందుల నేపథ్యంలో… హెచ్ఎండీఏను పునర్వ్యవస్థీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్లను విభజించి, ప్రతి జోన్కు కమిషనర్, ప్లానింగ్ అధికారులు, ఇంజినీరింగ్ విభాగాలను కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బల్దియా తరహాలోనే హెచ్ఎండీఏలోనూ కొత్త జోన్ల ద్వారా పాలన కొనసాగేంచేందుకు రంగం సిద్ధమైంది.