పరిగి, జూలై 19: టీజీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ విధానంలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పరిగి డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. వీటీపీఐఎస్, బ్యాకప్, ఏఐ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డేటా ఫీడింగ్, సిస్టమ్ సంబంధిత పనులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడేళ్ల కాలానికి అప్రెంటిస్‌గా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఐటీ/కంప్యూటర్ సైన్స్/ఏఐ/గణితం వంటి సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. దరఖాస్తు దారుల వయసు 30 సంవత్సరాలకు మించరాదని చెప్పారు. ఇతర వివరాలకు పరిగి డిపో కార్యాలయం లేదా 93471 63847, 75690 65644 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.