Republic Day | రాయపోల్, జనవరి 26 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రాయపోల్ మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణమోహన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, వనరుల కేంద్రంలో ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మానస, పీహెచ్సీ వద్ద డాక్టర్ మహారాజ్ బల్లా, గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
అనంతరం రాయపోల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన యోగ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మొక్కజొన్న పొట్టుతో బయోప్లాస్టిక్ తయారీపై రూపొందించిన ప్రాజెక్ట్‌తో దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థి నిశాంత్ రెడ్డిని నగదు బహుమతితో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాయపోల్ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ హన్మంతు రాజు, ఎంపీడీవో శ్రీనివాస్, దిశా కమిటీ సభ్యులు రవీందర్‌రెడ్డి, పాల సొసైటీ చైర్మన్ యాదవరెడ్డి, హెచ్ఎం వెంకటేశ్వర్లు, యువజన సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Proteins Makthal | జాతీయ జెండావిష్కరణలో అపశృతి.. ఒకరికి గాయాలు, మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం : వీడియో
ప్రోటీన్లు కావాలంటే నాన్ వెజ్ తినాల్సిన పనిలేదు.. వీటిని కూడా తినవచ్చు..!