Srinivas Goud | కేసీఆర్ నాయకత్వంలో సాగునీరు, విద్యా, వైద్య రంగాలు అభివృద్ధి : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Srinivas Goud | ముఖ్యమంతి కేసీఆర్ పదేళ్ల పాలనలో సాగునీరు, విద్యా, వైద్య రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్ నగర్ : తెలంగాణలో ముఖ్యమంతి కేసీఆర్( KCR ) పదేళ్ల పాలనలో సాగునీరు, విద్యా, వైద్య రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud ) అన్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ( Republic day ) సందర్భంగా జాతీయ పతకాన్ని ఎగురవేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారని కొనియాడారు. భారతదేశం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అక్కడక్కడ మహిళల పట్ల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి చురుకుగా జరిగాయని కొనియాడారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలన యెట్లా ఉందో గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమం లో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గణేష్, కోట్ల నర్సింహా, వెదవత్, రాము, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

