MEO Kanakaraju | రాయపోల్, సెప్టెంబర్ 03 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు అన్నారు. రాయపోల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 69వ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ దినోత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. విద్యలో ఏవిధంగా అయితే రాణిస్తారో ఆటల్లో కూడా మంచి ప్రతిభ చూపాలని.. ఆటలు విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని సూచించారు.
మూడు రోజులుగా నిర్వహించినటువంటి ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఖోఖోలో మొదటి స్థానం ఎంజేపీ బాయ్స్ లింగరాజుపల్లి, రెండవ స్థానం ఆదర్శ పాఠశాల దౌల్తాబాద్ కబడ్డీలో మొదటి స్థానం ఎంజేపీ బాయ్స్, రెండవ స్థానం సెయింట్ ఆన్స్, వాలీబాల్ మొదటి స్థానం బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్, రెండవ స్థానం బాలుర గురుకుల పాఠశాల లింగరాజు పల్లి అండర్ 17 వాలీబాల్ బాలికల విభాగంలో మొదటి స్థానం బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల షేర్ పల్లి రెండవ స్థానంలో గెలుపొందారు.
అండర్ -17 వాలీబాల్ బాలుర విభాగంలో జడ్పిహెచ్ఎస్ ఇందూప్రియల్ మొదటి స్థానంలో, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల లింగరాజు పల్లి రెండవ స్థానంలో గెలుపొందారు. మండలస్థాయిలో గెలుపొందిన విద్యార్థులను జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు పంపించడం జరుగుతుందని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అనిల్ కుమార్, గోపాల్ రెడ్డి, నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, హరికృష్ణ, సత్యనారాయణ, మహేష్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ విష్ణు వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్, సాయి కృష్ణ, డంబెల్ ప్రత్యూష, అనిత, మోహన్ వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
GST | సిమెంట్, ఉక్కుపై జీఎస్టీ రేట్ల తగ్గింపు.. రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం..!
Laxmidevipally : ‘పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి’
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్