Nur Khan Base | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)పై భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాక్‌కు చావు దెబ్బ తగిలింది. దాయాదికి చెందిన కీలక ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో దెబ్బతిన్న ఆ ఎయిర్‌బేస్‌లను పాక్ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం (Indian Air Force) జరిపిన దాడుల్లో ద్వంసమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ (Nur Khan Base)లో దాయాది పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి. పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలో ఈ ఎయిర్‌బేస్ ఉంది. అంతేకాదు దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే ఈ ఎయిర్‌బేస్ రాజకీయంగా, సైనిక పరంగా ఎంతో సున్నితమైందిగా చెప్తారు. అన్ని ఎయిర్‌ఫోర్స్ ఆపరేషన్లకు ఈ వైమానిక స్థావరమే అడ్డా. ప్రధాని సహా వీఐపీల ప్రైవేట్ జెట్లు ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మే 7వ తేదీన మెరుపు దాడులు చేసింది. భారత్ దాడిలో ఉగ్రస్థావరాలు నేలమట్టమయ్యాయి. ఎప్పటినుంచో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఈ చర్యతో రగిలిపోయింది. భారత్‌ను దొంగదెబ్బ తీయడానికి సరిహద్దు ప్రాంతాలపై కాల్పులు, దాడులకు తెగబడింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, జనావాసాలపై వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడింది. సరిహద్దుల్లో శతఘ్నులతో విరుచుకుపడింది. దీంతో పాక్ దాడులను తిప్పికొట్టిన భారత త్రివిధ దళాలు.. దాయాది దేశంలోని పలు వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులను ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీతో పాటు దక్షిణ పంజాబ్, లాహోర్, సియాల్కోట్కు సమీపంలోని దాదాపు ఎనిమిది పాక్ ఎయిర్‌బేస్‌లు దెబ్బతిన్నాయి.
Also Read..
Vladimir Putin | అదేం పెద్ద సీక్రెట్ కాదు.. మోదీతో సంభాషణపై పుతిన్
Kilauea Volcano Erupts | మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం.. 100 మీటర్ల మేర ఎగసిపడుతున్న లావా
Luxury Yacht | ప్రారంభించిన నిమిషాల్లోనే.. సముద్రంలో మునిగిపోయిన లగ్జరీ నౌక.. VIDEO