Vladimir Putin | ట్రంప్ టారిఫ్స్ వేళ సాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం (SCO summit)లో చైనా (China) అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్ (Vladimir Putin)తో ప్రధాని మోదీ భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రష్యా అధినేత పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీతో జరిగిన సంభాషణ గురించి పుతిన్ తాజాగా మీడియాకు వెల్లడించారు. అదేమీ పెద్ద సీక్రెట్ కాదని చెప్పుకొచ్చారు.
చైనా పర్యటన అనంతరం మీడియాతో పుతిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీతో కారులో సంభాషణ గురించి ప్రస్తావించారు. అదేం పెద్ద సీక్రెట్ కాదన్నారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో జరిగిన చర్చల గురించి మోదీకి వివరించినట్లు చెప్పుకొచ్చారు. అలస్కాలో ట్రంప్‌తో కలిసి కారులో ప్రయాణించిన సమయంలో 30 సెకన్లు మాత్రమే మాట్లాడుకున్నట్లు చెప్పారు. బ్రోకెన్ ఇంగ్లీష్‌లోనే తన సంభాషణ జరిగిందని వివరించారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉండటం చూసి సంతోషంగా ఉన్నానని అతనితో చెప్పినట్లు పుతిన్ ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, పుతిన్ ఇటీవలే అలస్కా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో జరిగిన సంభాషణ గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు పుతిన్ తాజాగా తెలిపారు.
Also Read..
Luxury Yacht | ప్రారంభించిన నిమిషాల్లోనే.. సముద్రంలో మునిగిపోయిన లగ్జరీ నౌక.. VIDEO
Kilauea Volcano Erupts | మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం.. 100 మీటర్ల మేర ఎగసిపడుతున్న లావా
Donald Trump | వార్వర్డ్కు నిధుల కోత.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ