Stray Dogs | రాయపోల్, జూలై 01 : రోడ్డుపైనే కుక్కలు ప్రతీ రోజు స్వైర విహారం చేస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కుక్కలు నడిరోడ్డుపై గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో అటువైపు వెళ్లే వాహనదారులు జంకుతున్నారు. ఇప్పటికే కుక్కల స్వైర విహారంతో పలువురికి రోడ్డు ప్రమాదాలు జరిగి కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రతి రోజు ప్రధాన రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులకు భయంగా ఉంది. కుక్కలు ఎప్పుడు కరుస్తాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనే ఈ పరిస్థితి ఉంటే గ్రామంలోని ప్రధాన వీధుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో మండల కేంద్రంలో కుక్కలు విపరీతంగా పెరగడంతో వీధుల వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై కాటు వేసిన సంఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి.
రాయపోల్ మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డైన దౌల్తాబాద్, గజ్వేల్ రోడ్డుపై కుక్కలు రాత్రిపూట, ఉదయం పూట ఎప్పటికీ మందకు మంద ఉండడంతో వచ్చి పోయే వాహనాదారులకు ఎంతో ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీసుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొంటున్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!