Yoga | రాయపోల్, ఏప్రిల్ 16 : మనిషి మానసికంగా ఆనందంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి పరిపూర్ణంగా జరగడానికి అవకాశం ఉంటుందని ఐకేపీ ఏపీఎం యాదగిరి అన్నారు. ఇవాళ రాయపోల్ మండల పరిధిలోని మల్లేశం పల్లి గ్రామంలో మహిళల అభివృద్ధి, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అనేక ఒత్తిడిలకు కారణమవుతున్న ఆధునిక జీవితంలో ప్రశాంతత కోసం నిత్యం కొంత సమయాన్ని యోగ, ధ్యానం లాంటి వాటి కోసం కేటాయించాలని సూచించారు. తద్వారా మానసికంగా దృఢంగా తయారవడంతోపాటు, కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
మహిళలు అభివృద్ధి చెందడం ద్వారా సమాజం మరింత ముందుకు సాగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఏ అనిత, మహిళా సంఘ సభ్యులు భాగ్య, యశోద, తదితరులు పాల్గొన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్