పాలమూరు: రెండు రోజుల క్రితం మహబూబ్నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు కేసీఆర్ హయంలో పేదలకు ఇల్లు అందించాలనే ధ్యేయంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి నిరుపేదలకు అందించామని అన్నారు. ఘటన స్థలానికి ఇప్పటివరకు కలెక్టర్ రాకపోవడంపై మంత్రి మండిపడ్డారు.
చిన్న జిల్లాల ఏర్పాటు ఉద్దేశం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చేయడం కోసమేనని తెలిపారు. ఘటన స్థలానికి కలెక్టర్, ఎస్పీ రావాలని, బాధిత కుటుంబాలను పరామర్శించా లన్నారు. అదేవిధంగా మరొక సంఘటన జరగకుండా క్వారీ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మరొక సంఘటన జరిగితే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందన్నారు. ఆయన వెంట మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.