Elections | రాయపోల్, డిసెంబర్ 25 : గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మూడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అనాజీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంతూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, ర్యాంపులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని, క్రిటికల్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌కు అనువుగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే విషయమై ఎంపీడీవోలతో సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎంపీడీవో చిలుముల శ్రీనివాస్.మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?