Rains | రాయపోల్, ఆగస్టు 27 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాయపోల్ మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మానస పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి, రాంసాగర్ గ్రామాల మధ్య భారీ వరద రావడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. అవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని ఈ సందర్భంగా ఎస్ఐ మానస సూచించారు. ఇంకా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పిల్లలు గాని, పెద్దలు, మహిళలు గాని చెరువులు, కుంటల దగ్గరకి వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా రైతులు తమ పొలాలకు వెళ్లే సమయంలో భారీ వర్షాల వల్ల ఏర్పడిన గుంతలను గమనించాలని అన్నారు. రైతులు పొలం పనుల కోసమని బోరు మెటర్స్ దగ్గర ఉన్న కరెంట్ తీగలను గమనించి తగు జాగ్రతలతో పనులు చేసుకోవాలని సూచించారు.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు చెట్ల వద్దకు వెళ్లరాదని.. వాటిపై పిడుగు పడే అవకాశం ఉన్నందున గొర్రెలు, గేదెల కాపరులు, కూలి రైతులు వెళ్లరాదని సూచించారు. వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు
Zaheerabad Rains | నిండుకుండలా మంజీరా.. పొంగిపొర్లుతున్న వాగులతో స్తంభించిన జనజీవనం
Zaheerabad Floods | వరద ముంపులో జహీరాబాద్ కాలనీలు.. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే మాణిక్ రావు