RTC Bus | సిద్దిపేట జిల్లా, మే 4 : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన కుకునూరుపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్-2 డిపో (TS02UC6003)కి చెందిన ఆర్టీసీ బస్సు కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారి వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్లో సుమారు 30 మందికిపైగా ప్రయాణికులుండగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.